పవన్ కళ్యాణ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. భీమ్లా నాయక్ కు రచ్చే ఇక..
Bheemla Nayak | సాధారణంగా కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్‌కు అస్సలు పడటం లేదు. ఇద్దరూ నిప్పు ఉప్పులా మారిపోయారు. గతేడాది వకీల్ సాబ్ సినిమా నుంచే టికెట్స్ సమస్య కూడా మొదలైంది. పవన్‌పై ఉన్న కోపంతో ఇండస్ట్రీని జగన్ ఆడుకుంటున్నాడు అంటూ కొందరు విమర్శలు కూడా చేశారు. ఇదే విషయం పవన్ కూడా చెప్పాడు. కావాలంటే తన సినిమాలపై కక్ష్య చూపించండి కానీ మిగిలిన సినిమాలను వదిలేయమని చెప్పాడాయన. ఆ తర్వాత కూడా పరిస్థితులు మారలేదు. మధ్యలో కరోనా కూడా రావడంతో మరోసారి భారీ సినిమాలన్నీ వాయిదా పడటం మొదలయ్యాయి. ఇప్పుడు మళ్లీ కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో వరసగా సినిమాలు విడుదల చేయబోతున్నారు. చాలా రోజుల తర్వాత భీమ్లా నాయక్ రూపంలో తెలుగు ఇండస్ట్రీలో ఓ భారీ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఫిబ్రవరి 25నే ఈ సినిమా రానుంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో థియేటర్స్ విషయంలో ప్రభుత్వం నిబంధనలు సడలిస్తోంది. ఇటీవలే నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్ల విషయంలో మరిన్ని సడలింపులు ఇచ్చింది. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఇకపై రాష్ట్రంలో సినిమా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇది కొత్త సినిమాలకు వరంగా మారింది. అయితే థియేటర్లలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ మధ్యే ఏపీ ప్రభుత్వం థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతించింది. ఈ ఆంక్షలు ఉండటంతో పెద్ద సినిమాలు విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలకు ఇది వరంగా మారింది. ముఖ్యంగా ఫిబ్రవరి 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే థియేటర్స్ దగ్గర మాస్ జాతర కనిపించడం ఖాయం.
Read More :
Bheemla Nayak | భీమ్లా నాయకా మజాకా..నాన్ థియాట్రికల్ రైట్స్ ఎంత పలికాయంటే..?”
Bheemla Nayak | భీమ్లా నాయకా మజాకా..నాన్ థియాట్రికల్ రైట్స్ ఎంత పలికాయంటే..?”
Bandla Ganesh speech | భీమ్లా నాయక్ ఈవెంట్లో బండ్ల స్పీచ్ లేనట్టేనా..?”
తగ్గేదే లే అంటున్న ఆడవాళ్లు మీకు జోహార్లు.. భీమ్లా నాయక్ తో పోటీకి రెడీ..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

