సినీ లవర్స్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు భీమ్లా నాయక్ (Bheemla Nayak). సాగర్ కే చంద్ర (Sagaar Chandra) డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన రషెస్ థియేటర్లలో మూవీ లవర్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నాయి. భీమ్లా నాయక్ విడుదలకు ముందే రికార్డులు తిరగరాసేలా కనిపిస్తోంది. నాన్ థియాట్రికల్ రైట్స్ (Non theatrical rights) సుమారు రూ.70 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు ఇంత భారీ మొత్తం పలుకడంతో భీమ్లా నాయక్ బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడం పక్కా అని తెలిసిపోతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కొషియుమ్కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో డానియల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తున్నాడు. కోలీవుడ్ బ్యూటీ నిత్యమీనన్, మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
భీమ్లానాయక్ రామోజీఫిలింసిటీలోని చివరి రోజు షెడ్యూల్‌తో నేడు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే డైరెక్టర్ సాగర్ చంద్ర పవన్ కల్యాణ్‌తో సెట్స్ లో దిగిన ఫొటో షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.