Ajith Kumar – Good Bad Ugly | తమిళ అగ్ర నటుడు అజిత్‌కుమార్(Ajith Kumar) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అజిత్ ఏకే అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సిమ్రాన్, ప్రభు, అర్జున్ దాస్, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.