Godzilla Minus One | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్. అకాడమీ అవార్డు విన్నర్, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం గాడ్జిల్లా మైనస్ వన్ (Godzilla Minus One) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. గతేడాది జపాన్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలలో గాడ్జిల్లా మైనస్ వన్(Godzilla Minus One) ఒకటి. మియామి హమాబ్, కమికి ర్యునోసుకే, యుకీ ఎండ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి టకాశీ యమజాకీ దర్శకత్వం వహించాడు. నవంబర్ 03 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. మరోవైపు ఈ సంవత్సరం అకాడమీ అవార్డులలో గాడ్జిల్లా మైనస్ వన్ సత్తా చాటింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి ఈ సినిమా అవార్డు గెలుచుకుంది.
Godzilla Minus One is available on Netflix and for digital purchase and digital rental starting June 1. Learn more: https://t.co/N9T9DEXLmw#GodzillaMinusOne #Godzilla pic.twitter.com/EcsYxOHwqR
— GODZILLA.OFFICIAL (@Godzilla_Toho) June 1, 2024