GOAT Movie | గతేడాది ‘లియో’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి బీటీఎస్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ పోస్టర్లో ఒకవైపు విజయ్ ఉండగా.. మరోవైపు వెంకట్ ప్రభు ఉన్నాడు. కాగా.. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
A @vp_offl BTS 🫶🏻#Thalapathy @actorvijay sir @Ags_production @archanakalpathi @aishkalpathi @thisisysr @Meenakshiioffl #TheGreatestOfAllTime pic.twitter.com/UjR8h4jPPd
— TheRoute (@TheRoute) March 23, 2024