వెంకట్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈట ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్ ప్రధానంగా సాగే మాస్ కథాంశమిది. వెంకట్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. తాను తొలిసారి మాస్ పాత్రను చేశానని, యాక్షన్ ఘట్టాల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నానని హీరో వెంకట్ తెలిపారు. ఇప్పటికే అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని, వచ్చే నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ఈట ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. హెబ్బాపటేల్, సలోని, శ్రీహరి తదితరులు చిత్ర తారాగణం.