Gladiator 2 | హాలీవుడ్ చారిత్రక ఇతిహాసం ‘గ్లాడియేటర్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా ‘గ్లాడియేటర్ 2’ తెరకెక్కింది. పాల్ మెస్కల్, పెడ్రో పాస్కల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రా రిడ్లే స్కాట్ దర్శకుడు. నవంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
నిరంకుశ చక్రవర్తులచే పరిపాలించబడుతున్న పురాతన రోమ్ నగరానికి సంబంధించిన అద్భుతమైన విజువల్స్ ఈ ట్రైలర్లో చూడొచ్చు. ఆత్మగౌరవం, ప్రతీకార నేపథ్యంలో, మాతృభూమికోసం కోసం జరిగే పోరాటమే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చెబుతున్నది. భయంకరమైన యుద్ధాలు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, హృదయాలను కదిలించే భావోద్వేగాలు.. వీటన్నిటి సమాహారమే ‘గ్లాడియేటర్ 2’ అని మేకర్స్ తెలిపారు.