మధుర స్మృతులకు మళ్లీ ఓం నమః
‘ఏయ్ లేచిపోదామన్న మొనగాడా.. రా చూద్దాం’ అన్న డైలాగ్‌తో తెలుగునాట అందరినీ ఉలికిపడేలా చేసిన కలికి గుర్తుందిగా?! ఓఁ.. ఆమె నయన శ్రుతులకు ఒక తరం హృదయాలు లయ తప్పాయి.
‘ఏయ్ లేచిపోదామన్న మొనగాడా.. రా చూద్దాం’ అన్న డైలాగ్‌తో తెలుగునాట అందరినీ ఉలికిపడేలా చేసిన కలికి గుర్తుందిగా?! ఓఁ.. ఆమె నయన శ్రుతులకు ఒక తరం హృదయాలు లయ తప్పాయి. ఆవిడ మధుర స్మృతులను ‘ఓం నమః..’ అని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు! 1989లో ‘గీతాంజలి’గా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసిన గిరిజ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఆ చిత్రం తర్వాత మలయాళంలో ఒకట్రెండు సినిమాలు చేసిన గిరిజ దాదాపు ‘తెర’మరుగైంది.
1992లో ఆమె నటించిన ‘హృదయాంజలి’ సినిమా 2002లో విడుదలైంది. ఇక 2003లో ‘తుఝే మేరీ కసమ్’ చిత్రంలో అతిథి పాత్రలో అలరించింది. దాదాపు 20 ఏండ్లుగా సిల్వర్‌స్క్రీన్‌కు దూరంగా ఉన్న గిరిజ షెట్టర్ ఓ కన్నడ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించనుంది. ‘ఇబ్బని తబ్బిద ఇళియాలి’ చిత్రంలో ఆమె నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చంద్రజిత్ దర్శకుడు. హీరోగా రక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో గిరిజ కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు సాండల్‌వుడ్ టాక్. ఆమెకు ఇదే తొలి కన్నడ చిత్రం!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

