Roshan Meka | హీరో శ్రీకాంత్ (Actor Srikanth) తనయడు రోషన్(Roshan Meka) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను వదిలారు. గిర గిర గిరగింగిరాగిరే అంటూ పాట రాగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యంను అందించాడు. రామ్ మిరియాలా పాడగా.. మిక్కి జే మేయర్ సంగీతంను అందించబోతున్నాడు. ఈ చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నాడు. మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) కథానాయికగా నటిస్తుంది.