కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకుడు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్‌మీడియాలో విడుదల చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. ‘నేను ఎవరి జోలికి వెళ్లను. ఓడిపోతాననే భయం కాదు. నేను వెళితే రణరంగం మారణహోమంగా మారుతుంది’ అంటూ శివరాజ్‌కుమార్ చెప్పిన సంభాషణలు రొమాంచితంగా సాగాయి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ హంగులతో ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. అనుపమ్‌ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ, సంగీతం: అర్జున్‌జన్య, కథ, దర్శకత్వం: శ్రీని.