అగ్ర కథానాయిక అనుష్క సినీ ప్రయాణంలో ఇరవై ఏండ్ల మైలురాయిని చేరుకుంది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ ఆమె ఖాతాలో ఉన్నాయి. దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనుష్క గత కొన్నేళ్లుగా మహిళా ప్రధాన ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నది. ఆమె ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఘాటి’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం అనుష్కశెట్టి పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..