Genelia | దీపికా పదుకొణే, సందీప్ రెడ్డి వంగాల మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి మనందరికి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్నస్పిరిట్ కోసం దీపికాని కథానాయికగా ఎంపిక్ చేయగా, ఆమె పెట్టిన డిమాండ్ల వలన సందీప్ తన ప్రాజెక్ట్ నుండి దీపికాని తప్పించి యానిమల్ హీరోయిన్ తృప్తి డిమ్రీని ఎంపిక చేశాడు. అయితే దీపికా పనివేళలతో పాటు రూ.25 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం వల్లనే ఆమెని తప్పించారనే ప్రచారం నడిచింది. దీపికా పెట్టిన కండీషన్స్ విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. దీనిని కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరి కొందరు వ్యతిరేఖిస్తున్నారు.
ఆ మధ్య ‘భజరంగీ భాయీజాన్’, ‘చందూ ఛాంపియన్’ తదితర హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కబీర్ ఖాన్.. దీపికా చేసిన డిమాండ్లు అసాధారణం కావని, న్యాయంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమలో పని చేసే వారందరు కూడా వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. స్టార్ హీరోలైన ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా రోజుకు 8 గంటల షిఫ్ట్ల్లోనే పని చేస్తారు. అలాంటప్పుడు దీపికా చెప్పిన పని గంటల విషయంలో విమర్శలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ ఆమెకి సపోర్ట్‌గా నిలిచాడు.
ఇక సుదీర్ఘ పని గంటల విషయంపై తాజాగా జెనీలియా స్పందించింది. ‘సితారే జమీన్ పర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా జెనీలియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “పనిచేసే తల్లులకు ఎక్కువ సమయం పని చేయడం కష్టమే అయినా అసాధ్యం ఏమి కాదు. నేను రోజుకు 10 గంటలు పనిచేస్తాను. కొన్నిసార్లు దర్శకుడు పనిని 11 లేదా 12 గంటల వరకు పొడిగించమని అడిగినప్పుడు నేను దానిని వ్యతిరేఖించను. అయితే సర్ధుబాట్లు చేసుకోవడానికి కొంత సమయం అవసరం అవుతుంది. ఒకటి రెండు రోజులు పని చేయాల్సి వచ్చినప్పుడు కాస్త అవగాహనతో పూర్తి చేసుకోవచ్చు అని పేర్కొంది. ఇప్పుడు జెనీలియా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.