Gautham Vasudev Menon | స్టార్ హీరోలతో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు ఆయన.. వందల సినిమాల్లో నటించి తన కామెడీతో వెన్నుముకగా నిలిచిన లెజెండరీ కమెడియన్ ఆయన. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా రాబోతుంది. తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం దీని గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఆ దర్శకుడు గౌతమ్ మీనన్ అయితే.. ఆ కమెడియన్ వడివేలు.
కొన్నేండ్లుగా వడివేలు సినిమాలు చేయడం లేదు. చేయట్లేదని చెప్పడం కంటే ఆయన్ను దూరం పెట్టారనే చెప్పాలి. అప్పట్లో వడివేలు చేసిన కొన్ని కామెంట్స్.. ఆయన కెరీర్‌పై దారుణమైన ప్రభావం చూపించింది. ఆ తర్వాత చాలారోజుల వరకు ఎవరూ ఆయనకు అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్న వడివేలుతో గౌతమ్ మీనన్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఘర్షణ, ఏ మాయ చేసావే లాంటి సినిమాలతో తెలుగులో కూడా ఆయనకు మంచి ఇమేజ్ వచ్చింది. కెరీర్ మొదటి నుంచి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న గౌతమ్ మీనన్.. ఇప్పుడు కమెడియన్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం శింబు హీరోగా గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలోనే ముంబైలో జరగనుంది. దీని తర్వాత వడివేలుతో ఓ హస్యభరితమైన సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు గౌతమ్ మీనన్ చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.