ఘర్షణ, ఏమాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో లాంటి
సూపర్ హిట్ చిత్రాలను తెలుగు, తమిళప్రేక్షకులకు అందించాడు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ (Gautham Menon). వీటితోపాటు మరెన్నో మైల్స్టోన్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈయన మంచి డైరెక్టర్ మాత్రమే కాదు యాక్టర్ కూడా అని సినీ లవర్స్ కు తెలిసిన విషయమే. మరోవైపు గౌతమ్ మీనన్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించి మెప్పించారు. ఈ స్టార్ డైరెక్టర్ ఇపుడు యువ హీరో సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (Sree Venkateswara Cinemas LLP), కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ (Karan C Productions LLP) సంయుక్తంగా సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా యాక్షన్ ఎంటర్టైన్ తెరకెక్కిస్తున్నాయి. మైఖేల్ (Michael)టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించనున్నాడు.
ఈ ప్రాజెక్టులో గౌతమ్ మీనన్ విలన్‌గా కనిపించనున్నట్టు టాక్. అయితే ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ ఫైనల్ అయ్యాడా..? లేదా అన్న దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే తెలుస్తుంది. బేడీలతో ఉన్న చేతి నుంచి రక్తం కారుతున్న మైఖేల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్