Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి వినాయక చవితి వేడుకలలో పాల్గోన్నారు. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో ఈ పూజ జరుగగా.. పూజ అనంతరం సల్మాన్ స్వయంగా గణపతికి హారతి ఇచ్చాడు. ఈ వేడుకకి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక ఈ పూజా కార్యక్రమంలో సల్మాన్ తల్లి సల్మా ఖాన్, తండ్రి సలీం ఖాన్, సోదరుడు అర్బాజ్ ఖాన్, సోదరి అల్విరా ఖాన్, ఆమె భర్త అతుల్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ, పిల్లలు అహిల్, అయత్ పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి రితేష్ దేశ్ముఖ్, జెనీలియా తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం తన కుటుంబంతో కలిసి గణపతి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
— Salman Khan (@BeingSalmanKhan) August 27, 2025