Gangs of Godavari | దాస్ కా ధమ్కి తర్వాత విశ్వక్ సేన్ (Vishwak Sen) చేస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తునారు. పిరియడ్ విలేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకి మరింత గ్లామర్ తోడైయింది.
బాహుబలి చిత్రంతో మనోహరీగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో మెరవనుందని సమాచారం. రంగస్థలం జిగేల్ రాణి పాట తరహాలో ఊర మాస్ గా ఉండబోతుంది ఈ స్పెషల్ సాంగ్. నోరా మంచి డ్యాన్సర్. ఈ పాటలో ఆమె డ్యాన్సులు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నాయనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ కథానాయకుడిగా చేస్తున్న మట్కా లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది నోరా.