Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొమ్మిది వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో పదోవారం చివరిరోజుకి చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనేది నేడు తెలియనుంది. అయితే ఈ క్రమంలోనే శనివారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం హౌజ్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయ్యింది. మామూలుగా అయితే ప్రతి వీకెండ్ ఆ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరికి లీస్ట్ ఓటింగ్ వస్తుందో వారిని ఎలిమినేట్ చేస్తారు. కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల గంగవ్వ శనివారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
గత సీజన్లో మెయిన్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన గంగవ్వ హౌస్ వాతావరణంకి అలవాటుపడలేకపోయింది. దీంతో మధ్యలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది. అయితే మళ్లీ ఈ సీజన్లో వెల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక వచ్చి రాగానే ఫిజికల్ టాస్కులో గెలిచి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది గంగవ్వ. అయితే గంగవ్వ వయసు దృష్ట్యా ఫిజికల్ టాస్కులు, గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడంపై దూరం పెట్టాడు బిగ్ బాస్. ఇదిలావుంటే శనివారం ఊహించని విధంగా గంగవ్వ బయటకు వచ్చేసింది. కాళ్లు చేతులు తిమ్మిరులు వస్తున్నాయని.. వారం రోజుల నుంచి ఒకపూట భోజనమే అవుతుందని తన ఇబ్బందులను నాగార్జునకు చెప్పింది. అయితే గంగవ్వ సమస్యలు విన్న నాగార్జున (Nagarjuna) హౌస్ లో ఉంటావా బయటకు వచ్చేస్తావా అంటే వెళ్తానని చెప్పింది. దాంతో గంగవ్వ బయటకు వచ్చేందుకు ఓకే చెప్పాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఐదు వారాలు హౌస్‌లో ఉంది.