గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియన్ నటులు మధుబాల, ఆదిత్యమీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. దయానంద్ దర్శకుడు. రవి కస్తూరి నిర్మాత. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమాలోని పాత్రలన్నీ గ్రేషేడ్లో ఉంటాయి. చనిపోదామనుకున్న ఓ వ్యక్తి రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? ఆ గేమ్‌లోని టాస్క్‌లను ఎలా పూర్తి చేశాడు? అసలు అతనితో ఆ గేమ్ ఆడించేదెవరు? అనే అంశాలతో ఈ కథ నడుస్తుంది.
యాక్షన్, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది. డార్క్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనూభూతినందిస్తుంది’ అన్నారు. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన హీరో అనూహ్యంగా ఒక గేమ్‌లో చిక్కుకుంటే ఏమయిందన్నది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని హీరో గీతానంద్ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: అభిషేక్ ఏఆర్, నిర్మాణ సంస్థలు: కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: దయానంద్.