అమరావతి : హైదరాబాద్ సంధ్యా థియోటర్లో పుష్ప-2 బెనిఫిట్ షోలో చోటుచేసుకున్న ఘటనను పరిగణనలోకి తీసుకున్న ఏపీ పోలీసులు గేమ్ ఛేంజర్ ( Game Changer ) సినిమాకు భారీ బందోబస్తును ( Security ) ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో (Rajahmundry) గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
ఈ ఈవెంట్‌కు గేమ్ ఛేంజర్ హీరో, గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Ram Charan) , బాబాయి , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్యఅతిథిగా వస్తుండడంతో జిల్లా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేయగా, దాదాపు లక్ష మంది అభిమానులు రానున్నారనే అంచనా వేశారు. ఈవెంట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా 400 మంది పోలీసు అధికారులు, 1200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తుకు ఏర్పాటు చేశారు.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత ఈవెంట్‌కు వస్తున్న తొలి సినిమా గేమ్ ఛేంజర్ కావడం, తన అన్న చిరంజీవి కుమారుడు రాం చరణ్ సినిమాలో హీరోగా నటించడం విశేషంగా మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేదిక వద్దకు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు పోలీసులు. గ్రౌండ్ సమీపంలో 20 వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. వేదిక ముందు బారికేడ్లు, హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు.