Game Changer | ‘గేమ్‌చేంజర్’ సినిమా విషయం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు వెలుగు చూస్తున్నాయి. సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండటంతో గాసిప్పులు కూడా అదే స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో సోమవారం మొదలుకానున్నదట. ప్రధాన తారాగణం మొత్తం ఈ షెడ్యూల్లో భాగం కానున్నారట.
కథ ప్రకారం ఇది కీలకమైన షెడ్యూల్ అని, ఈ షెడ్యూల్లోనే రామ్‌చరణ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నారని సమాచారం. అంచనాలకు తగ్గట్టుగా భారీ వాణిజ్య విలువలతో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్రకు జోడీగా అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కైరా ఆద్వానీ నటిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నవీన్‌చంద్ర ఇందులో కీలక పాత్రధారులు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా