ప్రతిష్టాత్మక GAMA – 2025 (Gulf Academy Movie Awards) వేడుకకు దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్ వేదిక కానుంది. దుబాయ్‌లో నాలుగేళ్లుగా, ప్రతి ఏడాదీ వైభవంగా ఈ అవార్డుల వేడుక జరిగిన నేపథ్యంలో.. ఆగస్ట్ 30న జరుగనున్న ఈ అయిదవ ఎడిషన్, తొలి నాలుగు ఎడిషన్స్‌ని మించి అత్యంత వైభవంగా జరుపనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ థీమ్ సాంగ్‌ను శనివారం దుబాయ్‌లో లాంచ్ చేశారు. గీతరచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటను రఘు కుంచె స్వరపరచి ఆలపించారు. ఆగస్ట్ 30న టాలీవుడ్ అవార్డ్స్‌తో పాటు, ఆగస్ట్ 29న ఎక్సలెన్స్ అవార్డుల వేడుకను కూడా నిర్వహించేలా భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం, శ్రీవిష్ణు, రోషన్, మీనాక్షి చౌదరి, దక్ష నగార్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.