Gaddar Awards | తెలుగు రాష్ట్రాలలో 14 ఏళ్ల తర్వాత సినీ పురస్కారాల సంబురం నెలకొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డులని అందించనుంది. ఇప్పటికే విధి విధానాలని ప్రకటించిన ప్రభుత్వం కొద్ది నిమిషాల క్రతం అవార్డులని ప్రకటించింది. ఈ గద్దర్ అవార్డుల జ్యూరీగా సీనియర్ నటి జయసుధను నియమించింది. మార్చి 13 నుంటి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి ఈరోజు ఉదయం అవార్డులను ప్రకటించింది. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి అవార్డుల జాబితాను ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్చను ఇచ్చిందని జయ సుధ తెలిపారు. ఎవరి ఒత్తిడి లేకుండా ఎలాంటి పక్షపాతం చూపించుకుండా సినిమాల్ని ఎంపిక చేశామని అన్నారు.
2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు. మొత్తం 1248 నామినేషన్స్ రాగా, వాటిని పరిశీలించి అవార్డుల గ్రహీతలని ప్రకటించారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ప్రకటించారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి- చక్రపాణి, కాంతారావు , రఘుపతి వెంకయ్య పేర్లతో కూడా అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం జూన్ 14న హైటెక్స్‌లో జరగనుంది.
గద్దర్ అవార్డుల జాబితా చూస్తే..