Gadar rerelease | ప్రస్తుతం సినిమాల రీరిలీజుల కాలం నడుస్తున్నది. హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు ఈ ట్రెండ్ కొనసాగుతున్నది. సూపర్ హిట్ సినిమాలను టీవీల్లో వేసినప్పుడే చూడటం ఏంటి? అని ఆలోచించిన మన నిర్మాతలు.. ఇటీవల రీరిలీజ్ ట్రెండ్‌ను మొదలుపెట్టారు. తెలుగులో కూడా ఈ ట్రెండ్ కొనసాగింది. అలాగే దేశాన్ని ఒక ఊపుఊపిన హాలీవుడ్ మూవీ అవతార్ కూడా రీరిలీజైంది. దీని బాటలోనే టైటానిక్ కూడా రీరిలీజ్‌కు సిద్ధమైంది.
సన్ని డియోల్ హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ‘గదర్-ఏక్ ప్రేమ్ కథా’ సినిమాను మరోసారి థియేటర్లలో ప్రదర్శించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. గదర్-2 సినిమా తయారవుతున్న వేళ 22 ఏండ్ల క్రితం థియేటర్లను షేక్ చేసిన గదర్ సినిమాను జూన్ 15 న రీరిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీని సెకండ్ పార్ట్‌గా నిర్మిస్తున్న గదర్-2 ను ఆగస్టు 11 న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. గదర్-2 ను 2001 లో విడుదలైన తేదీనే విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు. ప్రేక్షకులు పార్ట్-1 చూసి ఆ తర్వాత పార్ట్2 చూస్తే మరింత ఈజీగా అర్థమవుతుందని, అందుకే గదర్-2 విడుదల కంటే ముందుగా గదర్ సినిమాను రీరిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రకటించారు.
‘గదర్ కేవలం సినిమా కాదు. తారా సింగ్ పాత్ర మాత్రమే కాదు. కోట్లాది మంది ప్రజల మనోభావాలు. భారతదేశం నుంచి విదేశాల వరకు ఎందరో ప్రతిరోజూ గదర్-2 ని ట్రెండ్ చేస్తున్నారు. ఫొటోలను, ఎమోషన్లను పోస్ట్ చేస్తున్నారు. వారిని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. దయచేసి మరికొంత సమయం వేచి ఉండండి. ఈ సినిమా విడుదల ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తాం’ అని నిర్మాతలు నిట్టిన్ కేని, భన్వర్ సింగ్, భౌమిక్ గొండాలియాలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సన్నీ డియోల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా 2001 లో బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టింది.