Gadar-2 Movie Collections | సినిమా రిలీజై మూడు వారాలు దాటిన గదర్-2 గర్జన ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త రిలీజ్లు ఎన్నొచ్చినా ఈ సినిమా యుఫోరియాను మ్యాచ్ చేయలేకపోతున్నాయి. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న సిన్నీ డియోల్ ఈ రేంజ్లో హిట్టు కొడతాడని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఎప్పుడో సోలో హీరోగా మార్కెట్ కోల్పోయిన ఒక హీరో ఊహకందని రేంజ్లో స్టార్ హీరోల సినిమాలను దాటేస్తాడంటే గదర్-2 ముందు వరకు అవి వట్టి మాటలే అనిపించేవి. కానీ గదర్-2 సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం బాలీవుడ్ ట్రేడ్‌ను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే ఎన్నో ఏరియాల్లో ఖాన్ల, కపూర్ల రికార్డులను బద్దలు కొడుతూ బాలీవుడ్‌నాట సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా బాలీవుడ్ గడ్డపై సరికొత్త రికార్డు సాదించడానికి ముస్తాబవుతుంది. గదర్-2 సినిమా ఇప్పటివరకు రూ.493 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆదివారంతో రూ.500 కోట్ల మార్కును దాటనుంది. అది కూడా కేవలం మూడు వారాల్లోనే. హిందీ వెర్షన్లో ఇంత వేగంగా ఆ మార్క్‌ను అందుకున్న తొలి సినిమాగా గదర్-2 చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా బాహుబలి, పఠాన్ సినిమాల తర్వాత హిందీలో రూ.500 కోట్ల మార్క్ టచ్ చేయబోయే మూడో సినిమా గదర్-2 నిలవనుంది. అప్పుడెప్పుడో ఇరవైఏళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీస్తే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇరవైఏళ్లా, ముప్పయేళ్లా అని కాదు సరైన కథ, కథనం ఉంటే దశాబ్దాలు దాటిన సినిమా సీక్వెల్‌తో కూడా సరికొత్త రికార్డులు తిరగరాయోచ్చని గదర్-2 సినిమా నిరూపిస్తుంది.
ఈ ఏడాది మొదట్లో వచ్చిన పఠాన్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఇప్పటివరకు హిందీలో పడలేదు. ఇక ఇప్పుడు గదర్-2 అదే రేంజ్లో దూసుకపోతుంది. నిజానికి హిందీలో మాస్ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. బీ, సీ సెంటర్లలో ఆ వెలతి స్పష్టంగా కనిపించింది. ఇక గదర్-2తో ఆ లోటు దాదాపుగా పూర్తయిపోయింది. ఈ సినిమా ప్రభావం జనాలపై ఎంతుందంటే.. థియేటర్లకు ట్రాక్టర్లలో వెళ్లేంతలా ఉంది. అనీల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీషా పటేల్ హీరోయిన్గా నటించింది.
NEW RECORD… ‘GADAR 2’ FASTEST TO CROSS ₹ 500 CR… #Gadar2 will cross the HISTORIC ₹ 500 cr mark in #India today [Sun]…
⭐️ #Gadar2: Day 24 [today]
⭐️ #Pathaan: Day 28
⭐️ #Baahubali2 #Hindi: Day 34#India biz. Nett BOC. #Hindi version only. pic.twitter.com/oLvK8p97KO— taran adarsh (@taran_adarsh) September 3, 2023