విల్లాలీ వీరనే.. వీరమణికంఠనే
అగ్ర హీరో రవితేజ ‘ఇరుముడి’ సినిమా టైటిల్ ప్రకటించిన నాటి నుంచే సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమాగా దీన్ని ప్రమోట్ చేయడం, హీరో అయ్యప్ప మాల ధరించి ప్రచార చిత్రాల్లో కనిపించడం, పడిపూజకు చెందిన వాతావరణం..
అగ్ర హీరో రవితేజ ‘ఇరుముడి’ సినిమా టైటిల్ ప్రకటించిన నాటి నుంచే సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమాగా దీన్ని ప్రమోట్ చేయడం, హీరో అయ్యప్ప మాల ధరించి ప్రచార చిత్రాల్లో కనిపించడం, పడిపూజకు చెందిన వాతావరణం.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈ సారి రవితేజకు హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలావుంటే.. చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తన ట్విటర్(ఎక్స్) ద్వారా ఈ సినిమాకు చెందిన ఓ తాజా అప్డేట్ని అభిమానులతో పంచుకున్నారు.
అయ్యప్ప భజన కీర్తనల్లో ‘విల్లాలీ వీరనే.. వీరమణి కంఠనే..’ భజన గీతానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయ్యప్ప పడిపూజ సమయాల్లో ఈ పాట పాడితే పూనకాలతో అయ్యప్పస్వాములంతా ఊగిపోతుంటారు. దక్షిణ భారతంలో బాగా డిమాండ్ ఉన్న ఈ పాటను ‘ఇరుముడి’ దర్శక,నిర్మాతలు అంగీకరిస్తే సినిమాలో పెడతామని చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ గతంలో చెప్పారు. తాజాగా ఆయనే స్వయంగా దర్శక,నిర్మాతలను ఒప్పించి ఈ సినిమాలో ఆ పాటను పెట్టినట్టు తన ఎక్స్ ద్వారా అధికారికంగా తెలిపారు. ఈ పాటకు థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రియా భవానీశంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: శివ నిర్వాణ, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

