G.V.Prakash Kumar | జీ.వి.ప్రకాష్ కుమార్.. ఈ పేరు షానా ఏండ్ల నుంచి తెలుగు ప్రేక్షకులు వింటున్న పేరే. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా సూపర్ ఫామ్‌లో ఉంటూనే మరో వైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా జీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించాడు. కింగ్స్టన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి అల్టిమేట్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. సముద్రంలో పడవపై నిల్చుని ఎదురుగా వస్తున్న భారీ అలకు బల్లెంను విసురుతున్నట్లు ఆసక్తికరంగా పోస్టర్‌ను డిజైన్ చేశారు.
అదీకాకుండా ఆ అల మొత్తం పుర్రెలతో పోయింది. దీన్ని బట్టి చూస్తే ఇదోక హార్రర్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. అంతేకాకుండా సబ్ టైటిల్లో శపించబడిన సముద్రం అంటూ రాసుకొచ్చారు. ఒక్క పోస్టరే ఈ లెవల్లో ఉందంటే సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో అని అప్పుడు తమిళ తంబీలు ఊహల్లో తేలిపోయారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ బాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యాచ్‌లర్‌తో జీవికి బెస్ట్ పేయిర్ అనిపించుకున్న దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందిన. ఇక ఇప్పటి వరకు కంపోజర్‌గా, హీరోగా దూసుకుపోతున్న జీ.వి ఇప్పుడు నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.