Fukrey 3 Trailer | బాలీవుడ్లో వచ్చిన పాపులర్ కామెడీ చిత్రాలలో ఫుక్రే (Fukrey) ఒకటి. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి బాలీవుడ్లో హిట్ కొట్టిన ఈ మూవీ తాజాగా మూడో భాగం సిద్ధమవుతోంది. మొదటి రెండు పార్ట్‌లలో లీడ్ రోల్స్ చేసిన రిచా చద్దా (Richa Chadda), పుల్కిత్ సామ్రాట్ (Pulikit Samrat), వరుణ్ శర్మ (Varun Sharma), పంకజ్ త్రిపాఠి (Pankaj tripati) ఈ చిత్రంలో కూడా ప్రధాన పాత్రాలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 05న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలోప్రకటించారు. ఇక ‘ఫుక్రే 3’ సినిమాకు కూడా మ్రిగదీప్ సింగ్ లంబా (Mrigdeep Singh Lamba) దర్శకత్వం వహిస్తుండగా ఎక్సెల్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. కామెడీ ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘FUKREY 3’ TRAILER ARRIVES TOMORROW… Meet the #Fukrey3 gang… #Fukrey3Trailer to be unveiled tomorrow [5 Sept 2023]… In *cinemas* 28 Sept 2023.#MrighdeepSinghLamba #RiteshSidhwani #FarhanAkhtar pic.twitter.com/HjPDT3wKBY
— taran adarsh (@taran_adarsh) September 4, 2023