MS raju Nexr Project | తెలుగు సినీ పరిశ్రమలో ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఆల్-టైమ్ క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అగ్ర నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్. రాజు ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మెలోడీలు, మనసుకు హత్తుకునే ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ఈసారి కంప్లీట్ డిఫరెంట్ జానర్లో మెగాఫోన్ పట్టారు. The Man Who Made You Feel… Now Makes You Fear అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ అయిన ఈ చిత్రానికి ‘అగాధ’ (Agadha) అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. నేడు ఉదయం 10:20 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. సాధారణంగా ఫీల్ గుడ్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఎమ్.ఎస్. రాజు, ఈసారి పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకోవడం టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం డార్క్ ఫోర్సెస్ , నిషేధించబడిన నిజాలు మరియు రక్తం-నమ్మకం నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణమని తెలుస్తోంది.
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్. రాజు స్వయంగా కథ, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, జునైద్ సిద్ధీఖీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్య వేగ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఒక చీకటి శక్తి.. ఒక రహస్య సత్యం.. రక్తం మరియు నమ్మకం నుంచి పుట్టిన లెక్క తేల్చుకునే సమయం అంటూ విడుదలైన ఈ పోస్టర్ సినిమా మూడ్‌ను స్పష్టం చేస్తోంది.
A Dark Force..
A Forbidden Truth…
A Reckoning born in Blood & Belief 🔥Presenting the striking first look of @MSRajuOfficial’s next titled #Agadha 💥
Written & Directed by #MSRaju@SAVProductions_ @bhaskarla_sai @shravanreddy7_ @Ulka12official #JovikaVijayKumar pic.twitter.com/knsD2rorvo
— MS Raju (@MSRajuOfficial) April 15, 2026