స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫ్రిదా మోడల్‌గా రాణిస్తూ, ఎక్కువగా హాలీవుడ్లో అలరిస్తోంది. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ , గర్ల్ రైజింగ్, డిజెర్ట్ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్, లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. మ్యూజిక్ ఆల్భమ్స్‌లో కూడా సత్తా చాటింది.
ఫ్రిదా పింటో తన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్తను ఫ్యాన్స్‌కు చెప్పింది. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న మేము త్వరలో చిన్నారికి జన్మనివ్వబోతున్నట్టు తెలియజేసింది. నా కలల అద్భుతాన్ని వివాహమాడాను. దీన్ని రహస్యంగా ఉంచాలనుకోలేదు.. ఇద్దరమూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం.. ఇపుడు మీ అందరి కోసం ఈ విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను అంటూ భర్త కోరీ ట్రాన్‌తో దిగిన ఫొటోలని షేర్ చేసింది. లాక్డౌన్ కాలంలో కాలిఫోర్నియాలోని హోండా సెంటర్లో వివాహం చేసుకుందట. ప్రస్తుతం వారికి నెటిజన్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.