శనివారం రోజు నాగార్జున ఇంటి సభ్యులతో సరదా గేమ్ ఆడించాడు. మొదటగా వచ్చిన రవి. ప్రియాంక సింగ్‌ను అటెన్షన్ సీకర్‌గా పేర్కొన్నాడు. తర్వాత వచ్చిన ప్రియ.. లోబోను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటూ వాచ్ యువర్ టంగ్ అని పేర్కొంది. అతడు ఉరొమి చూస్తున్నాడని చెప్పడంతో నాగ్.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నవారందరు సేఫ్‌గా ఉంటారు అని అన్నాడు.
ఇక లోబో, అనీ మాస్టర్ కూడా ప్రియాంక సింగ్‌ను అటెన్షన్ సీకర్‌గా పేర్కొన్నాడు. హమీదా.. సన్నీని బుర్ర వాడమని సూచించింది. కాజల్.. లోబో సింపతీ కోరుకుంటాడని పేర్కొంది. నటరాజ్ మాస్టర్.. విశ్వ సింపతీ పొందాలని చూస్తాడని విమర్శించాడు. ఇక విశ్వ, సిరి.. లోబో మెదడు వాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
లోబో తన భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అని తెలియజేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేయాలని పేర్కొన్నాడు.దీనికి నాగ్ స్పెషల్ విషెస్ అందించాడు. అనంతరం ప్రియాంక సింగ్, శ్రీరామ్.. లోబోను, శ్వేత.. కాజల్‌ను వాచ్ యువర్ టంగ్ అని పేర్కొన్నారు. తర్వాత వచ్చిన జెస్సీ.. రవిని మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని వార్నింగ్ ఇచ్చాడు. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా మీద ఫోకస్ పెట్టడం ఆపేయ్ అని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు.
నాగ్ కూడా రవికి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత షణ్ముఖ్.. సిరిని బ్రెయిన్ వాడమని సలహా ఇచ్చాడు. దీంతో సిరి.. తాను సేవ్ అయితే రేపటినుంచి ఇంకో సిరిని చూస్తారని సవాలు విసిరింది. ఇక నామినేషన్లో ఉన్న రవి, సన్నీ, కాజల్, ప్రియ సేవ్ కాగా లోబో, అనీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్లో ఉన్నారు. నటరాజ్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తుంది.