ముంబై : నూతన సంవత్సరంలోకి కోటి ఆశలతో జనం అడుగుపెట్టిన వేళ సెలబ్రిటీలు సైతం తమకిష్టమైన వారితో ఫేవరెట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్‌ను (New Year Celebrations) స్వాగతించారు. ఆత్మీయులతో, అందమైన లొకేషన్లలో కొందరు కొత్త ఏడాదిని స్వాగతిస్తే మరికొందరు కుటుంబసభ్యులతో కూల్‌గా న్యూ ఇయర్‌ను వెల్కమ్ చేశారు. బాలీవుడ్ భామలు, సెలబ్రిటీలు సైతం తమదైన స్టైల్‌తో న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేశారు.
కొత్త ఏడాదిని స్వాగతిస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కరీనా కపూర్ న్యూ ఇయర్‌ను స్టైల్, కంఫర్ట్ మేళవిస్తూ స్వాగతించింది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఇమేజ్‌లో కరీనా బెడ్‌పై తన భర్తతో కూర్చుని వైన్‌ను ఎంజాయ్ చేయడం కనిపించింది. ఇది అత్యుత్తమ రాత్రి ఎప్పటికీ..2024.. ప్రేమ, శాంతి వెదజల్లాలి..హ్యాపీ న్యూ ఇయర్, లవ్లీ పీపుల్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫుడీ, ఫిట్నెస్ ప్రియురాలైన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి రుచికరమైన చనా దాల్ పాయసం బౌల్, చనా దాల్, బెల్లం, నెయ్యి, నట్స్, కొబ్బరి పాలతో చేసిన మంగళూర్ డిష్‌తో న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పింది.
కొత్తగా పెండ్లయిన నటి పరిణీతి చోప్రా తన భర్త, రాజకీయ నేత రాఘవ్ చద్దాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించింది. చాక్లెట్స్, బేవరేజెస్‌తో ఎంజాయ్ చేసింది. నటి మిథిలా పల్కార్ క్లాసిక్ బ్రేక్‌ఫాస్ట్ పోహతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. న్యూ ఇయర్ సందర్భంగా బీచ్ వెకేషన్‌కు వెళ్లిన నటి భూమి పెడ్నేకర్ స్ట్రీట్ ఫుడ్ న్యూటెల్లా పాన్కేక్ తయారు చేసే వీడియోను పోస్ట్ చేసింది. థాయ్‌ల్యాండ్ బీచ్‌ల్లో ప్రస్తుతం సందడి చేస్తున్న నటి కరిష్మా కపూర్ కూరగాయలు, ఫ్లవర్ షేప్ ట్రీట్స్‌తో కూడిన ఫ్రెష్ సీఫుడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికపై షేర్ చేసింది.
Read More :