Fish Venkat | టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వెంకట్ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టలేనంత తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకట్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే అతడి కిడ్నీలు మార్పిడి చేయకపోతే అతడు బతకడం కష్టమని వెద్యులు తెలిపినట్లు వెంకట్ కూతురు స్రవంతి వెల్లడించింది. ప్రస్తుతం తాము వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా తమకు సాయం చేయాలని స్రవంతి కోరుతున్నారు.
ఫిష్ వెంకట్ గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో గతంలో డయాలసిస్ చికిత్స తీసుకున్నారు. అయితే ప్రస్తుతం వెంకట్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు కుటుంబసభ్యులు. గతంలో ఫిష్ వెంకట్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఏపీ డిప్యూటి సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు.