వినయ్‌కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘కాలమేగా కరిగింది’. సింగార మోహన్ దర్శకుడు. మరే శివశంకర్ నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలో ‘ఊహలోన ఊసులాడే’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు సింగార మోహన్ రాసిన ఈ పాటను గుడప్పన్ స్వరపరచగా, సాయిమాధవ్, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ప్రేమానుభూతిని కలిగించేలా ఈ పాట సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వినీత్ పబ్బతి.