Lily Telugu Trailer | బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పీరియాడిక్, యాక్షన్‌తోపాటు పలు జోనర్లలో పాన్ ఇండియా చిత్రాలు మార్కెట్లో సందడి చేశాయి. కాగా తొలిసారి చిన్నపిల్లలపై పాన్ ఇండియా మూవీ వస్తోంది. శివమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా లిల్లీ (Lily). ఈ సినిమా ట్రైలర్‌ను నేడు మేకర్స్ లాంఛ్ చేశారు. బేబీ నేహా (Baby Neha) టైటిల్ రోల్ పోషిస్తోంది.
ఈ చిత్రం లిల్లీ అనే చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కనున్నట్టు ట్రైలర్ తో చెప్పాడు దర్శకుడు. చిన్నారులను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది. ప్రణీతరెడ్డి, వేదాంత్ వర్మ, రాజ్వీర్, మిచెల్లీ షా, రాజీవ్ గోవింద పిళ్లై, శివకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లిల్లీ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ బ్యానర్‌పై కే బాబు రెడ్డి, జీ సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు. లిల్లీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
లిల్లీ తెలుగు ట్రైలర్..
The First PAN India Children Film ❤️
Here's #LILY Theatrical trailer✨
▶️ https://t.co/KarA0qccABComing soon to theatres!#GopuramStudios @Sivamthedir #BabuReddyK #SatishKumar @therajveerrv @Rajeev_gpillai #YesRajKumar #LokeshKadali @sivamallala @PicturePitch_ #FriendsForLife pic.twitter.com/fi8I0NPvbf
— BA Raju's Team (@baraju_SuperHit) March 13, 2023
Legend Saravanan | షాకింగ్ స్టైలిష్ లుక్‌లో లెజెండ్ శరవణన్.. త్వరలోనే నయా అప్డేట్
Bhuvana Vijayam | ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. ఇంట్రెస్టింగ్గా భువన విజయమ్ టీజర్
Dasara | ఉత్తరాదిన నాని దసరా ట్రైలర్ లాంఛ్.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?