Bhuvana Vijayam | ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. ఇంట్రెస్టింగ్గా భువన విజయమ్ టీజర్
క్రైం కామెడీ థ్రిల్లర్ జోనర్లో సునీల్ (Sunil) లీడ్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ భువన విజయమ్ (Bhuvana Vijayam). తాజాగా ఈ మూవీ టీజర్ (Bhuvana Vijayam Teaser)ను లాంఛ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ నటుడు సునీల్ (Sunil) లీడ్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ భువన విజయమ్ (Bhuvana Vijayam). క్రైం కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని యలమంద చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ (Bhuvana Vijayam Teaser)ను లాంఛ్ చేశారు మేకర్స్.
‘ఒకరంటే ఒకరికి పడని 8 మంది రచయితలు..అనుకోకుండా రైటర్‌గా మారిన ఒక దొంగ. ఎవ్వరినీ లెక్కచేయని ఒక పిచ్చోడు. చచ్చి కూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఒక ఆత్మ.. ఇద్దరు యమభటులు, చిత్రగుప్తుడు, ఒక దేవకన్య.. అంటూ సినిమా పాత్రలను పరిచయం చేస్తూ’ సాగుతున్న టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సునీల్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న జైలర్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్‌లో మంగళం శ్రీనుగా నటిస్తున్నాడు. వీటితోపాటు తమిళ సినిమాలు మార్క్ ఆంటోనీ, జపాన్, మావీరన్, మిస్టర్ కింగ్ సినిమాలు చేస్తున్నాడు.
భువన విజయమ్ టీజర్..
Crime Comedy Thriller Movie @bhuvanavijayam_ Teaser Out Now 💫
Watch & Enjoy ▶️ https://t.co/dqI7M0G263@suniltollywood @vennelakishore @harshachemudu @DhanrajOffl #YalamandaCharan @mirthhimalaya @adityamusic @teju9666 @CineDigital_ pic.twitter.com/9ZCDMJhfAm
— BA Raju's Team (@baraju_SuperHit) March 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

