అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్-2’. నాని సమర్పణలో వాల్పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిరినేని నిర్మిస్తున్నారు. శుక్రవారం అడివిశేష్ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమా ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ ఏపీకి చెందిన హిట్ టీమ్ అధికారి కృష్ణదేవ్ అలియాస్ కేడీగా కనిపించనున్నారు. ‘ఓ పోలీసాఫీసర్ కథ ఇది. ఓ కేసు అన్వేషణలో అతనికి ఎదురైన సవాళ్లు, తెలుసుకున్న నిజాలేమిటన్నది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. మీనాక్షి చౌదరి, రావు రమేష్, భానుచందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్స్, రచన-దర్శకత్వం: ఎస్.వెంకటరత్నం (వెంకట్).