స్వీయ దర్శకత్వంలో ఎస్జే సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కిల్లర్’. శ్రీగోకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతి ఆస్రాని కథానాయిక. పదేళ్ల విరామం తర్వాత ఎస్జే సూర్య డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది కావడం విశేషం.
శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఎస్జే సూర్య గన్ పట్టుకొని ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నామని, ఎస్జే సూర్య పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, కిల్లర్ వెనకున్న రహస్యం ఏమిటన్నది ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుందని మేకర్స్ తెలిపారు. ్ర