Harry Potter | మంత్రలోకపు మాయాజాలం మళ్లీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు దశాబ్ద కాలంగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ‘హ్యారీ పోటర్’ టీవీ సిరీస్ నుంచి కళ్లు చెదిరే ‘ఫస్ట్ లుక్’ వచ్చేసింది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ HBO తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్, హాగ్వార్ట్స్ మంత్రలోకాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత అద్భుతంగా, కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించింది.
ముఖ్యంగా ఈ ఫస్ట్ లుక్‌లో కొత్త హ్యారీ పోటర్‌గా డొమినిక్ మెక్లాఫ్లిన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం హ్యారీ మాత్రమే కాకుండా.. ఈ సిరీస్ కోసం ఒక భారీ స్టార్ కాస్ట్‌ను ఎంపిక చేశారు. రాన్ వీస్లీగా అలస్టైర్ స్టౌట్, హెర్మియోన్ గ్రేంజర్గా అరబెల్లా స్టాంటన్‌లు మనల్ని అలరించడానికి సిద్ధమయ్యారు. ఇక అత్యంత కీలకమైన ఆల్బస్ డంబుల్డోర్ పాత్రలో ప్రముఖ నటుడు జాన్ లిత్గో, ప్రొఫెసర్ స్నేప్గా పాపా ఎస్సీడు లాంటి దిగ్గజాలు నటిస్తుండటంతో ఈ సిరీస్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 ప్రారంభంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
First look at HBO’s ‘HARRY POTTER’ reboot series.
The first teaser will be released tomorrow. pic.twitter.com/xxkzBlOv5a
— Pop Base (@PopBase) March 24, 2026