Monalisa | అతను నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అమ్మ,నాన్నతో చెప్పినా… మోనాలిసా సంచలన కామెంట్స్
Monalisa | కుంభమేళాతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నటి మోనాలిసా భోంస్లే జీవితం మరోసారి వివాదాల కేంద్రంగా నిలిచింది. సహజ సౌందర్యం, నీలి కళ్లుతో గుర్తింపు పొందిన ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, ఒక్క సినిమా విడుదల కాకముందే వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.
Monalisa | కుంభమేళాతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నటి మోనాలిసా భోంస్లే జీవితం మరోసారి వివాదాల కేంద్రంగా నిలిచింది. సహజ సౌందర్యం, నీలి కళ్లుతో గుర్తింపు పొందిన ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, ఒక్క సినిమా విడుదల కాకముందే వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకోవడానికి కుటుంబాన్ని ఎదిరించింది ఈ భామ.కొద్ది రోజుల క్రితం తిరువనంతపురంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహంపై దర్శకుడు సనోజ్ మిశ్రా “లవ్ జిహాద్” అంటూ ఆరోపణలు చేయడం కొత్త వివాదానికి దారితీసింది. మరోవైపు ఆమె బంధువు విజయ్ భోస్లే, మోనాలిసా మైనర్ అంటూ ఈ వివాహం చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఈ వివాదాల మధ్య, మోనాలిసా భోంస్లే తన భర్తతో కలిసి కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని, షూటింగ్ సమయంలో తనపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో కుటుంబ సభ్యులకు చెప్పినా, “మొదటి సినిమా కాబట్టి సర్దుకుపో” అంటూ తనను మౌనంగా ఉండేలా చేశారని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు. తనపై, తన భర్తపై ప్రాణహానీ బెదిరింపులు కూడా వస్తున్నాయని చెబుతూ, కేంద్రంతో పాటు కేరళ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల సహాయం కోరారు.
తన పెళ్లిని “లవ్ జిహాద్”గా అభివర్ణించడం వెనుక వ్యక్తిగత కక్షే కారణమని మోనాలిసా స్పష్టం చేశారు. తాము చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నామని, ప్రతి మతాన్ని గౌరవిస్తామని తెలిపారు. తమ వివాహంపై తప్పుడు ప్రచారం చేస్తున్న దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. “మా పెళ్లి గుడిలో హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. దేశం మొత్తం చూసింది. అయినా ఇలా ఆరోపించడం బాధాకరం” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

