Kidnap | ముదిగొండ, మార్చి 25: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సర్పంచ్ భర్త కిడ్నాప్ కలకలం రేపింది. పండ్రేగుపల్లి గ్రామ సర్పంచ్ పాము స్వర్ణలత భర్త పాము సిల్వరాజును బుధవారం తెల్లవారుజామున దుండగులు కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లిన సిల్వరాజు ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన అతని కుటుంబసభ్యులు గ్రామంలో విచారించగా.. ఎవరో కారులో తీసుకెళ్లడం చూశామని తెలిపారు. అయితే కారులో ఉన్నవాళ్లు తెలిసిన వాళ్లే కావచ్చని తాము పట్టించుకోలేదని పేర్కొన్నారు. పొద్దున వెళ్లిన వ్యక్తి ఇంకా రాకపోవడంతో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై సర్పంచ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
సిల్వరాజు గతంల్ పండ్రేగుపల్లి సర్పంచ్‌గా చేశారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. సిల్వరాజు కిడ్నాప్‌పై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.