వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తన శైలిలో సాగే యాక్షన్ కామెడీ డ్రామాగా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఫస్ట్ హాఫ్ ఇప్పటికే పూర్తయింది.
జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2027 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో నిర్మాత సాహు గారపాటి ఉన్నట్టు తెలిసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ క్లాప్ కొట్టకుండానే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఆల్‌టైమ్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయినట్టు తెలిసింది. కల్యాణ్‌రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటించనుండగా, వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్ ఖరారైనట్టు వార్తలొస్తున్నాయి.