Final Destination Bloodlines | హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్ ‘ఫైనల్ డెస్టినేషన్ – బ్లడ్లైన్స్’ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ చిత్రం నేటినుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇండియాలో మంచి వసూళ్లను రాబట్టింది. తొలిరోజే ఏకంగా రూ. 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. దీంతో ఇండియాలో హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి ఆడమ్ స్టెయిన్ & జాక్ లిపోవ్స్కీ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. బుసిక్ & లోరి ఎవాన్స్ టేలర్ స్క్రీన్ ప్లే అందించారు. కైట్లిన్ శాంటా జువానా, టెయో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, అన్నా లోరే ముఖ్య పాత్రల్లో నటించారు.
You can’t cheat death forever… and time’s up.
Final Destination: Bloodlines now streaming in English, Hindi, Tamil and Telugu only on JioHotstar.#TonyTodd #FinalDestination #Bloodlines #Horror #Thriller #Mystery #Supernatural #JioHotstar pic.twitter.com/frEuMgVtj5
— JioHotstar (@JioHotstar) October 16, 2025
మరోవైపు ఇండియాలో ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్కు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2011లో విడుదలైన ‘ఫైనల్ డెస్టినేషన్ 5’ ఇండియాలో కేవలం రూ. 7.65 కోట్లు మాత్రమే వసూలు చేసింది.