Vijay Devarakonda| విజయ్ దేవరకొండ డిమాండ్స్..చేతులెత్తేసిన దర్శకనిర్మాతలు..?
అర్జున్ రెడ్డి, గీతాగోవిందం చిత్రాల తర్వాత మళ్లీ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు యువ హీరో విజయ్ దేవర కొండ (Vijay Devarakonda).

అర్జున్ రెడ్డి, గీతాగోవిందం చిత్రాల తర్వాత మళ్లీ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు యువ హీరో విజయ్ దేవర కొండ (Vijay Devarakonda). ఈ హీరో ప్రస్తుతం పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తో కలిసి లైగర్ (Liger)మూవీ చేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ పైకి రావాలని, పాన్ ఇండియా స్థాయి మార్కెట్ సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. భవిష్యత్‌లో పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెట్టాలని ఫిక్సయిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.
మరోవైపు నిన్ను కోరి, మజిలీ ఫేం శివ నిర్వాణ (Shiva Nirvana)తో సినిమా చేయబోతున్నాడని, ఇది కూడా పాన్ ఇండియా నేపథ్యంలోనే ఉండాలనుకుంటున్నాడని న్యూస్ తెరపైకి వచ్చింది. అంతేకాదు విజయ్ దేవరకొండ డైరెక్టర్ శివనిర్వాణను స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచిస్తూనే..మరోవైపు నిర్మాతలకు బడ్జెట్ పెంచాలని చెప్పాడని టాక్ నడుస్తుంది. అయితే విజయ్ దేవరకొండ కోరినట్టుగానే శివనిర్వాణ కథలో మార్పులు చేసేందుకు సిద్దంగా ఉన్నాడట. కానీ విజయ్ మాత్రం పాన్ ఇండియా స్థాయికి చేరుకునేలా భారీ మార్పులు ఆశిస్తుండటంతో శివ నిర్వాణ కాస్త వెనకడుగు వేసినట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు నిర్మాత మాత్రం విజయ్ డిమాండ్స్ కు తగ్గట్టుగా ఇప్పట్లో పాన్ ఇండియా బడ్జెట్ తో సినిమా చేసేందుకు రెడీగా లేడని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. లైగర్ తో తన రేంజ్ పెరుగుతుందన్ నమ్మకంతో ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పటికపుడు అంతలా డిమాండ్స్ చేయడంతో ముక్కున వేలేసుకుంటున్నారట మేకర్స్.
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

