Fighter Movie Glimps | ఒకప్పుడు వందల కోట్లు సునాయసంగా కొట్టేసిన హిందీ సినిమాలు ఇప్పుడు వంద కోట్ల మార్కును టచ్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. కరోనా తర్వాత కోలుకోలేని దెబ్బ తిన్న హిందీ పరిశ్రమకు భూల్భూలయ్య-2, భోళా వంటి అర కొర సినిమాలు జనాలను థియేటర్లకు రప్పించినా.. సౌత్ సినిమాల డామినేషన్‌ను ఎదర్కోలేకపోయాయి. ఇక అప్పుడు వచ్చింది పటాన్. నాలుగేళ్ల తర్వాత వెండితెరపై షారుఖ్‌ను చూసేందుకు హిందీ జనాలు థియేటర్లకు పరుగులు తీశారు. దానికి తోడు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ టేకింగ్, విజన్‌కు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ఈ సినిమాతో సిద్దార్థ్ పేరు హిందీనాట మార్మోగిపోయింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫైటర్.
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొల్పాయి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పైన చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే మేకర్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. హృతిక్, దీపికాతో పాటు అనీల్ కపూర్ లుక్స్‌ను వీడియోలో చూపించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్‌డే సందర్భంగా ఒక రోజు ముందుగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వయాకామ్18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
HRITHIK – DEEPIKA – ANIL KAPOOR: ‘FIGHTER’ MOTION POSTER IS HERE… Team #Fighter – starring #HrithikRoshan, #DeepikaPadukone and #AnilKapoor – unveils a new #MotionPoster, on the occasion of #IndependenceDay… Directed by #SiddharthAnand… In *cinemas* [Thu] 25 Jan 2024… pic.twitter.com/GBqIUu0pH5
— taran adarsh (@taran_adarsh) August 15, 2023