కెప్టెన్సీ టాస్క్ కోసం జరుగుతున్న నియంత టాస్క్‌లో మూడో సారి రవి.. నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిసభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో చివరి రెండు స్థానాల్లో మానస్, షణ్ముఖ్‌లు నిలవగా, నియంత రవి .. షణ్ముఖ్‌ని సేవ్ చేసి మానస్‌ని డిస్ క్వాలిఫై చేశాడు. నాలుగో రౌండ్లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. మిగిలిన ఇంటి సభ్యులకు వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇచ్చారు.
ఈ ఛాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలవడంతో వీళ్లలో ఒక్కర్ని సేవ్ చేసి.. ఒక్కర్ని డిస్ క్వాలిఫై చేసే అధికారం నియంతగా ఉన్న ప్రియాంక చేతుల్లోకి వెళ్లింది. షన్నూకి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పింది. దీంతో శ్రీరామ్ గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యాడు. దీంతో కాజల్ ఆనందానికి అవధులు లేవు.. డాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకుంది.
ఐదో రౌండ్లో భాగంగా.. నియంత సింహాసనంపై కూర్చోవడానికి రవి, షన్నూ, సిరి, ప్రియాంకలు పోటీపడ్డారు. అయితే బజర్ మోగేసమయానికి సిరి, ప్రియాంకలు ఇద్దరూ ఒకేసారి సింహాసనంపై కూర్చున్నారు. అయితే ప్రియాంక కంటే సిరినే ముందు కూర్చున్నట్టుగా విజువల్‌లో కనిపించింది. మానస్.. ప్రియాంకి సపోర్ట్ చేయగా, షణ్ముఖ్ …సిరి కూర్చుందని అంటున్నాడు.
ఈ విషయంలో సిరి.. ప్రియాంకను గెలిపించాలని ఉంటే గెలిపించుకోండి కానీ.. అన్ ఫెయిర్ గేమ్ ఆడొద్దని చెప్పింది. ఇక ఈ రోజు ఎపిసోడ్లో సన్నీ-మానస్‌ల మధ్య గొడవ జరగడం ఆసక్తిగా ఉండనుది. ఇద్దరి మిత్రుల మధ్య మంట పెట్టిన ఇష్యూ ఏంటనే దానిపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.