బిగ్ బాస్ హౌజ్‌లో శనివారం సన్నీ, అనీల మధ్య ఫైట్ రెండు గ్ర్రూపుల ఫైట్‌గా మారింది. సన్నీని సపోర్ట్ చేసే వాళ్లు కొందరు ఉంటే వ్యతిరేఖించే వారు మరి కొందరు ఉన్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంటే షణ్ముఖ్ నవ్వుకుంటూ కనిపించాడు. దీంతో సన్నీ.. హౌస్‌లో గొడవ అవుతుంటే.. అది చూసి నవ్వుతున్నావ్ చూడు అది కరెక్ట్ కాదని షణ్ముఖ్‌ని హెచ్చరించాడు. దీనికి షణ్ముఖ్.. నాకు నవ్వు వచ్చింది నవ్వాను అని అన్నాడు.
నీకు గేమ్ అంటే మజాక్‌గా ఉంది. నేను బయటకు వస్తే ఉంటంది అని షణ్ముఖ్‌ని టార్గెట్ చేశాడు సన్నీ.దీనికి షణ్ముఖ్.. వామ్మో భయం వేస్తుంది.ఇప్పుడే పోసుకుని వచ్చా.. నీ భయానికి మళ్లీ పోసుకుని వస్తా అని పంచ్ వేశాడు షణ్ముఖ్. నువ్ భయపడ్డావ్ కాబట్టే నన్ను లోపల పెట్టావ్.. అని సన్నీ అన్నాడు. నీకు నేను భయపడటం లేదు.. నువ్ ఫిజికల్ అయ్యావని నేను అనలేదు.. హౌస్‌లో వాళ్లు అన్నారు..
నువ్వు కొడతా అంటే వచ్చి కొట్టు.. నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అన్నాడు షణ్ముఖ్. నేను బయటకు వస్తే కథ వేరే ఉంటుందని సన్నీ అంటే.. కథ వేరే ఎందుకు ఇక్కడే చూపించు అని అన్నాడు షణ్ముఖ్. ఇంతలో సిరి ఇన్వాల్వ్ అయ్యి.. ఒరేయ్ సొహైల్‌గా గుర్తొచ్చావ్రా అంటూ సన్నీని రెచ్చగొట్టింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సన్నీ జైలు శిక్ష ముగిసిందని చెప్పాడు. బయటకు వచ్చిన వెంటనే శ్రీరామ్‌తో కొద్ది సేపు డిస్కషన్ జరిపాడు.