Dacoit | టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి డెకాయిట్ (Dacoit). షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే డెకాయిట్ టీం రిలీజ్ చేసిన పోస్టర్లో మృణాల్ ఠాకూర్ ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. మరోచేతిలో పిస్తోల్ పట్టుకొని కనిపిస్తుంది. పక్కనే అడివి శేష్ సిగరెట్ వెలిగిస్తున్నాడు.
డెకాయిట్‌లో హీరోహీరోయిన్లిద్దరూ ఏదో మిషన్‌లో పాల్గొంటున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం 2025 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అడివి శేష్‌కు గాయం కారణంగా విడుదల తేదీకి బ్రేక్ పడింది.
తాజా టాక్ ప్రకారం మేకర్స్ డెకాయిట్‌ను ఫెస్టివల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండగా.. రేపు మధ్యాహ్నం 1:08 గంటలకు క్లారిటీ రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ క్యాలెండర్ మార్క్ చేయబడింది.. డేట్ లాక్ చేశాం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఇంతకీ డెకాయిట్ రిలీజ్‌ను వచ్చే సంక్రాంతికి ఏమైనా ప్లాన్ చేశారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అడివిశేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన షనీల్ డియో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Calendar marked. Date locked. #DACOIT RELEASE DATE ANNOUNCEMENT TOMORROW at 1.08 PM ❤🔥
Stay tuned!@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas #BheemsCeciroleo @Gyaani_official @danushbhaskar @abburiravi @KrishSiddipalli @srinagendrapd @KalyanKodati… pic.twitter.com/l5ocBU3PER
— BA Raju’s Team (@baraju_SuperHit) October 27, 2025