వేదిక లీడ్‌రోల్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. డా.హరిత గోగినేని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. స్క్రిప్ట్‌ని నమ్మి చేసిన సినిమా ఇదని, నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నామని, గురువారం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నామని నిర్మాత అభి తెలిపారు. ‘ఫియర్ స్క్రీన్‌ప్లే ఓరియెంటెడ్ మూవీ. సినిమా అంతా ఒక కాన్సెప్ట్‌తో వెళ్తుంది. విడుదలకు ముందే 70 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమాలో వేదిక డ్యుయెల్ రోల్ చేశారు. వేదిక సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. అనూప్ మ్యూజిక్, ఆండ్రూ విజువల్స్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయి. ఫియర్ సినిమాతో ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని తెరపై చూస్తేనే బావుంటుంది.’ అని డైరెక్టర్ హరిత గోగినేని అన్నారు.