న్యూఢిల్లీ: పాకిస్థాన్ హీరో ఫవద్ ఖాన్(Fawad Khan), వాణీ కపూర్ నటించిన ఆబిర్ గులాల్ చిత్రం రిలీజ్ డేను ప్రకటించారు. ఆగస్టు 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిల్మ్‌ను రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇండియా ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా దూరం కానున్నది. ఈ ఫిల్మ్‌ను ఇండియాలో రిలీజ్ చేయడం లేదు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు 75 దేశాల్లో ఆబిల్ గులాల్ ఫిల్మ్ రిలీజ్ కానున్నది. అయితే పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్‌ను వాయిదా వేశారు. ఆర్తి ఎస్ బాగ్ది ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
వాస్తవానికి ఈ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 22న జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఆ ఫిల్మ్ రిలీజ్ వాయిదా పడింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాకిస్థాన్ ఆర్టిస్టుల చిత్రాలను బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఫవద్ ఖాన్ సోషల్ మీడియా అకౌంట్‌తో పాటు మరికొంత మంది పాక్ నటుల అకౌంట్లను బ్లాక్ చేశారు. ఆ జాబితాలో హనియా, మహిరా ఖాన్, అలీ జాఫర్, ఆతిఫ్ అస్లమ్, రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఫిల్మ్ రిలీజ్ మరిత సందిగ్ధంలో పడింది. ఆబిర్ గులాల్ చిత్రాన్ని వివేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో లీసా హేడన్, రిద్ది డోగ్ర, పర్మీత్ సేథ్ నటిస్తున్నారు.