Prabhas | ఓ వైపు ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగులతో.. మరోవైపు ‘కల్కి 2’,‘స్పిరిట్’ చిత్రాల కథా చర్చలతో యమ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఒకే సమయంలో మూడ్నాలుగు పానిండియా సినిమాలకు పనిచేస్తున్నారాయన. రీసెంట్గా ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది.
ప్రభాస్‌తోపాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. బ్రిటీష్ కాలంనాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. విభిన్న కోణాలతో ఆయన పాత్ర సాగుతుందని సమాచారం. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.